త్రీ పాయింట్ లైటింగ్ | 3 Point Lighting in Film in Telugu

త్రీ పాయింట్ లైటింగ్(3 Point Lighting in Film in Telugu) అనేది ఫిలిం మేకింగ్ లో ఉపయోగించే అత్యంత బేసిక్ మరియు  ఉపయోగకరమైన లైటింగ్ సెటప్ ల లో ఒకటి .ఇందులో మూడు వేరు వేరు లైట్లను ఉపయోగిస్తాము.అందమైన మరియు ఆహ్లాదకరమైన సినిమాటిక్ షార్ట్ ను రూపొందించడానికి ఫ్రేమ్ లో ఉన్న సబ్జెక్టుకు నిర్దిష్ట స్థితి లో ఈ మూడు లైట్లు అమర్చడం జరుగుతుంది . 

ఈ ఆర్టికల్లో త్రీ పాయింట్ లైటింగ్ అంటే ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత మరియు ఉపయోగించే విధానం దానిలోని వివిధ భాగాలను క్లుప్తంగా వివరించడం జరుగుతుంది 

త్రీ పాయింట్ లైటింగ్ కంపోనేనట్స్ The three components of 3 Point Lighting in Film in Telugu

సినిమాటిక్ షార్ట్ ను కంపోజ్ చేయడంలో త్రీ పాయింట్ లైటింగ్(3 Point Lighting in Film in Telugu) అనేది ముఖ్యపాత్ర వహిస్తుంది. ఈ త్రీ పాయింట్ లైటింగ్ లో మూడు ముఖ్యమైన కాంపోనెంట్స్ ఉంటాయి

  1.  కీ లైట్
  2.  ఫీల్ లైట్
  3.  బ్యాక్ లైట్

 ఈ మూడు రకాల  లైట్ల ద్వారా రూపొందించిన లైటింగ్ సెటప్ ని త్రీ పాయింట్ లైటింగ్ అంటారు 

కీలైట్ The key light

  • కీలైట్ అనేది లైటింగ్ సెటప్ లో ముఖ్యమైన లైట్ .
  • ఒక షాట్ లో ఇదే మేజర్ లైట్స్ సోర్స్.త్రీ పాయింట్ లైటింగ్ లో కీ లైట్ అనేది ఎక్కువ కాంతిని కలిగి ఉంటుంది.
  •  కీ లైట్ అనేది ఫ్రేమ్ లో  ఉన్న సబ్జెక్టుకి  45 డిగ్రీ యాంగిల్ లో అమర్చడం జరుగుతుంది.ఈ లైట్ నేరుగా సబ్జెక్టు యొక్క ఫేస్ మీదపడుతుంది.
  • కీ లైట్ అనేది షాట్లో బేసిక్ షాడోలని  క్రియేట్ చేస్తుంది.
  • షాడో అనేది సబ్జెక్టుకు డెప్త్ మరియు డైమెన్షియాలిటీ క్రియేట్ అవుతుంది. 
  • కీలైట్ పొజిషన్ ని లొకేషన్ లో  ఉన్న సోర్స్ లైట్ ఆధారంగా నిర్ణయిస్తారు. 

ఫిల్ లైట్ The fill light

  • ఫిల్ లైట్ అనేది సాఫ్ట్ లైట్ ను  కలిగి ఉంటుంది.
  • కీ  లైట్ ద్వారా క్రియేట్ చేయబడినటువంటి షాడోస్ ని తొలగించడానికి ఫీల్ లైట్ ను ఉపయోగిస్తారు.
  •  ఫీల్ లైట్ అనేది కీలైట్ కి ఎదురుగా  అమరుస్తారు. దీని యొక్క ఇంటెన్సిటీ   కీ లైట్ తో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. 
  • ఫీల్ లైట్ ను షాట్ లో  లైటింగ్ ను  బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగిస్తారు 
  • న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది

బ్యాక్ లైట్ The backlight

  • షార్ట్ లోపల  సబ్జెక్టు యొక్క వెనుక భాగంలో బ్యాక్ లైట్ ను  అమర్చడం జరుగుతుంది. 
  • సబ్జెక్టు యొక్క తల మరియు భుజాల పైన లైట్ అనేది ప్రసరిస్తుంది
  • సబ్జెక్టుని బ్యాగ్రౌండ్ నుంచి సపరేట్ చేయడానికి బ్యాక్ లైట్ ను ఉపయోగిస్తారు
  • బ్యాక్ లైట్ సబ్జెక్టు వెనక భాగంలో ఉపయోగించడం ద్వారా సబ్జెక్టు యొక్క తల మరియు భుజముల పైనుంచి కాంతి  అంచును క్రియేట్ చేస్తుంది.ఇది సబ్జెక్టును బ్యాగ్రౌండ్ నుంచి మరింత స్పష్టంగా వేరు చేయడానికి ఉపయోగపడుతుంది 
  • ఇది సబ్జెక్టుకు డెప్త్ ను మరియు డైమెన్షియాలిటీ  క్రియేట్ చేస్తుంది

త్రీ పాయింట్ లైటింగ్ ఉపయోగాలు key benefits of 3 Point Lighting in Film in Telugu

  •  త్రీ పాయింట్ లైటింగ్(3 Point Lighting in Film in Telugu) ద్వారా నేచురల్ మరియు రియలిస్టిక్ నుండి డ్రమటిక్ మరియు స్తైలైజేడ్ లైటింగ్ ఎఫెక్ట్స్ వరకు క్రియేట్ చేయవచ్చు 
  • లో ఇంటెన్సిటీ ఫిల్   లైట్ ఉపయోగించడం ద్వారా నేచురల్ లైట్ ఎఫెక్ట్ ఉన్న ఇమేజ్ను క్రియేట్ చేయవచ్చు అదే హై ఇంటర్సిటీ ఫిల్   లైట్ ఉపయోగించడం ద్వారా డ్రమెటిక్ ఎఫెక్ట్ ఉన్న ఇమేజ్ను క్రియేట్ చేయవచ్చు 
  • త్రీ పాయింట్ లైటింగ్ సెట్ అప్స్ లో లైట్స్ యొక్క స్థానాన్ని మరియు ఇంటెన్సిటీని మార్చడం ద్వారా మనం అనుకున్న చాలా రకాలైనటువంటి లైటింగ్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేయవచ్చు
  • త్రీ పాయింట్ లైటింగ్ లో కి లైటును సబ్జెక్టుకు దగ్గరగా తీసుకురావడం ద్వారా డ్రమెటిక్ మరియు ఇంటెన్స్ లుక్ ఉన్న ఇమేజ్ ను  క్రియేట్ చేయవచ్చు. 
  • అదేవిధంగా త్రీ పాయింట్ లైటింగ్(3 Point Lighting in Film in Telugu) లో బ్యాక్ లైట్ యొక్క ఇంటెన్సిటీని పెంచడం ద్వారా సబ్జెక్టు చుట్టూ  రిమ్ లైట్ అంచును క్రియేట్ చేయవచ్చు దీని ద్వారా స్టైలిష్టిక్ మరియు డ్రమాటిక్ ఇమేజ్ ను క్రియేట్ చేయవచ్చు

త్రీ పాయింట్ లైటింగ్ ఉదాహరణలు examples of 3 Point Lighting in Film in Telugu

సినిమాలలో త్రీ పాయింట్ లైటింగ్ సెటప్(3 Point Lighting in Film in Telugu) ను  ఎలా ఉపయోగిస్తారో కొన్ని ఉదాహరణ ద్వారా చూడవచ్చు

  • రొమాంటిక్ కామెడీ మూవీస్ లో లైటింగ్ అనేది నేచురల్ గా మరియు బ్రైట్ గా ఉంటుంది లో ఇంటెన్సిటీ ఉన్న ఫీల్ లైట్ ని ఉపయోగించడం ద్వారా సాఫ్ట్ మరియు రొమాంటిక్  లుక్ ను క్రియేట్ చేయవచ్చు.
  • యాక్షన్ మూవీస్ లో లైటింగ్ అనేది డ్రమటిక్ గా మరియు ఇంటెన్స్ గా ఉంటుంది హై ఇంటర్సిటీ ఉన్న ఫిల్ లైట్స్ ని ఉపయోగించడం ద్వారా డ్రమాటిక్  షాడోస్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది
  • హారర్ మూవీస్ లో చీకటిని మరియు డల్నెస్ క్రియేట్ చేయడానికి లో ఇంటెన్సిటీ ఉన్న ఫిల్ లైట్స్ ని ఉపయోగించడం జరుగుతుంది మరియు విలన్ చుట్టూ కాంతి వలయాన్ని క్రియేట్ చేయడానికి హై ఇంటెన్సిటీ ఉన్న బ్యాక్ లైట్ ని ఉపయోగించడం జరుగుతుంది. దీని ద్వారా భయాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది 

ముగింపు Conclusion

పైన వివరించిన విధంగా త్రీ పాయింట్ లైటింగ్(3 Point Lighting in Film in Telugu) సెటప్స్ ని ఉపయోగించి దర్శకుడు ఊహించుకున్న ఇమేజ్ ను  క్రియేట్ చేయవచ్చు 

3-పాయింట్ లైటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి?( What is the 3-point lighting system?)

సబ్జెక్ట్ ను మూడు లైట్ సోర్స్ తో లైటింగ్ చేసే విధానాన్ని లేదా సెటప్ ను 3 పాయింట్ లైటింగ్ అంటారు

ఉదాహరణ కు మూడు-పాయింట్ లైటింగ్ టెక్నిక్ అంటే ఏమిటి? (What is three-point lighting technique with example?)

సబ్జెక్ట్ కి మొదటగా కీ లైట్ ను add చెయ్యాలి షాడో లని తొలగించడానికి ఫిల్ లైట్ add చెయ్యాలి background ను సబ్జెక్ట్ నుంచి సెపరేట్ చెయ్యడానికి back లైట్ ను add చెయ్యాలి

3-పాయింట్ లైటింగ్ తీవ్రత అంటే ఏమిటి? (What is 3-point lighting intensity?)

3 పాయింట్ లైటింగ్ సెటప్ లో ఉన్న ప్రతి లైట్ వేరు వేరు ఇంటెన్సిటీ ని కలిగి ఉంటుంది మూడ్ ను మరియు లుక్ ను create చెయ్యడానికి ఇంటెన్సిటీ లో హెచ్చు తగ్గులు ఉపయోగపడతాయి

త్రీ పాయింట్ లైటింగ్‌కి మరో పేరు ఏమిటి?What is another name for three-point lighting?

రిమ్ లైట్ ,సైడ్ లైట్ ,కీ లైట్ ,ఫిల్ లైట్ సెటప్ ఇలా రకరకాలుగా అంటారు

other posts

బెస్ట్ 5 టైప్ ఆఫ్ కెమెరా యాంగిల్స్

15 బేసిక్ టైప్ అఫ్ కెమెరా షాట్స్

సినీ లెన్సెస్