ఫిల్మ్ లో నాచురల్ లైటింగ్ మరియు ఆర్టిఫిషియల్ లైటింగ్ మధ్య గల తేడా (Difference between Natural Lighting and Artificial Lighting in Film)
చలనచిత్ర రంగంలో ఫిలిం లైటింగ్ కు చాలా ప్రాముఖ్యత ఉన్నది.లైటింగ్ ద్వారా ఒక మూడ్ ని సెట్ చేయవచ్చు ఎమోషన్ ని క్రియేట్ చేయవచ్చు మరియు ఉద్వేగాన్ని కలిగించవచ్చు ఎన్విరాన్మెంట్ ని డిసైడ్ చేయవచ్చు.
Table of Contents
నాచురల్ లైటింగ్ మరియు ఆర్టిఫిషియల్ లైటింగ్ (Difference between Natural Lighting and Artificial Lighting in Film)
ఫిలిం లైటింగ్ రెండు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది నాచురల్ లైటింగ్ మరియు రెండవది ఆర్టిఫిషియల్ లైటింగ్
ఈ ఆర్టికల్లో ప్రధానంగా నాచురల్ లైటింగ్ మరియు ఆర్టిఫిషియల్ లైటింగ్ యొక్క ప్రాధాన్యత మరియు విశేషత మరియు ఫిలింస్ లో ఏ విధంగా వాడతారు మొదలైనటువంటి అంశాలను వివరించడం జరుగుతుంది.
నాచురల్ లైటింగ్ (Natural Lighting)
నాచురల్ లైటింగ్ అంటే వాతావరణం లో సహజసిద్ధంగా లభించే కాంతి తో సీన్ ను షూట్ చేస్తారు. సూర్యుడు చంద్రుడు మరియు కొన్ని రకాల స్ట్రీట్ ల్యాంప్స్ ను కూడా నాచురల్ లైటింగ్ సోర్సెస్ గా పరిగణించవచ్చు.
నాచురల్ లైటింగ్ అనేది వాతావరణ మీద, రోజు యొక్క టైం మీద మరియు లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణ
- 127 Hours మూవీని నాచురల్ లైటింగ్ కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.Aron Ralston అనే ఒక mountain climber నిర్మానుష్యమైన ప్రాంతంలో అనుకోని విధంగా కొండ చర్యల మధ్య భాగంలో అతని చెయ్యి ఇరుక్కపోయి ఉంటుంది అతడు ఎలా బయటపడ్డాడు అనేదే ఆ మూవీ
- ఈ మూవీ ని నేచురల్ లైటింగ్ ఉపయోగించి క్యాప్చర్ చేయడం జరిగింది.. నాచురల్ లైటింగ్ ఉపయోగించడం వల్ల సూర్యకాంతి మరియు దాని ద్వారా ఏర్పడే నీడల వలన sense of realism మరియు authenticity క్రియేట్ చేయడం సాధ్యమవుతుంది
- The Revenant అనే మూవీని నాచురల్ లైటింగ్ కు మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.Hugh Glass అనే ఒక frontiersman తన సహచరులతో వేటకు వెళ్ళినప్పుడు ధ్రువపు ఎలుగుబంటి దాడి చేయడం వల్ల ఒంటరిగా వదిలివేయబడతాడు
- ఈ మూవీలో కూడా నాచురల్ లైట్ సోర్స్ గా సూర్యున్ని ఎక్కువ భాగం వాడడం జరిగింది .నాచురల్ లైటింగ్ను ను ఉపయోగించి sense of realism మరియు authenticity క్రియేట్ చేయడం జరిగింది
ఆర్టిఫిషియల్ లైటింగ్ (Artificial Lighting)
ఆర్టిఫిషియల్ లైటింగ్ లో లైట్ సోర్సెస్ ని ఉపయోగించి సీన్ ను లిట్ చేయడం జరుగుతుంది .లైట్ సోర్సెస్ గా ఎల్ఈడిస్ ,లైట్ బల్బ్ మరియు ఇతర రకాల లైట్ సోర్సెస్ ని ఉపయోగిస్తారు
ఆర్టిఫిషియల్ లైటింగ్ ద్వారా specific mood లేదా atmosphere ను క్రియేట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆర్టిఫిషియల్ లైటింగ్ ను ఉపయోగించడం ద్వారా లైటింగ్ మీద పూర్తి నియంత్రణ ఉంటుంది
ఉదాహరణ
- Blade Runner 2049 మూవీని ఆర్టిఫిషియల్ లైటింగ్ కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ మూవీ dystopian future అనే ప్రపంచంలో జరుగుతుంది ఈ సినిమాలో డార్క్ అండ్ మూడీ అట్మాస్ఫియర్ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఇటువంటి మూడ్స్ ని క్రియేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ లైటింగ్ అనేది ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది ఈ సినిమాలో sense of tension మరియు danger ను క్రియేట్ చేయడానికి ఈ ఫిలిం డైరెక్టర్ ఎక్కువగా ఆర్టిఫిషియల్ లైటింగ్ మీద ఆధారపడాల్సి వచ్చింది
- The Dark Knight అనే మూవీని మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ మూవీ గౌతమ్ అనే సిటీలో బ్యాట్ మాన్ కు మరియు జోకర్ కు మధ్య జరిగే సమరంగా చెప్పుకోవచ్చు ఈ మూవీలో సెన్స్ ఆఫ్ టెన్షన్ మరియు డేంజర్ ను క్రియేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ లైఫ్ ని ఉపయోగించడం జరిగింది
నాచురల్ లైటింగ్ vs ఆర్టిఫిషియల్ లైటింగ్
లైటింగ్ | ఉపయోగం | కంట్రోల్ |
నాచురల్ లైటింగ్ | sense of authenticity and realism | నియంత్రణ కష్టం |
ఆర్టిఫిషియల్ లైటింగ్ | specific mood or atmosphere | నియంత్రణ సులభం |
ముగింపు
నాచురల్ లైటింగ్ మరియు ఆర్టిఫిషియల్ లైటింగ్ ను ఉపయోగించడం అనేది పూర్తిగా ఫిల్మ్ మేకర్ యొక్క విజువలైజేషన్ మీద మరియు సీన్ యొక్క అవసరం మీద ఆధారపడి ఉంటుంది నేచురల్ లైటింగ్ మరియు ఆర్టిఫిషియల్ లైటింగ్ రెండిటిని ఉపయోగించి అద్భుతమైన విజువల్స్ ని క్రియేట్ చేయవచ్చు
F.A.Q
నాచురల్ లైటింగ్ అంటే ఏమిటి? (What is natural lighting in film?)
సహజ సిద్ధంగా లభించే సూర్యకాంతి ద్వారా సీన్ ను షూట్ చేయడం జరుగుతుంది దానిని నాచురల్ లైటింగ్ అంటారు
ఆర్టిఫిషియల్ లైటింగ్ ఫిలిమ్స్ లో ఎందుకు వాడుతారు? (Why is artificial lighting used in film?)
ఆర్టిఫిషియల్ లైటింగ్ ఉపయోగించడం ద్వారా పూర్తి నియంత్రణ మన చేతిలో ఉంటుంది
నాచురల్ మరియు ఆర్టిఫిషియల్ నైట్ లైట్స్ కి మూడు ఉదాహరణలు ఏమిటి? (What are 3 examples of natural and artificial light?)
సూర్యుడు చంద్రుడు క్యాండిల్స్ ని నాచురల్ లైట్స్ గా చెప్పుకోవచ్చు ఎల్ఈడి, లైట్ బల్బ్ మొదలైన ఆర్టిఫిషియల్ లైట్స్ గా చెప్పుకోవచ్చు
other articles