RRR Movie Three Act Structure – RRR మూవీ లో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కథానాయకులు గా నటించగా ss రాజమౌళి ఈ సినిమా కి దర్శకత్వం వహించడం జరిగింది
Table of Contents
RRR Movie Three Act Structure
Hook – Opening Image
గిరిజన తండా లో మల్లి అనే పిల్ల ని బ్రిటిష్ అధికారి భార్య కోరిక మేరకు మల్లి తల్లిని గాయపరిచి తీసుకపోవడం జరుగుతుంది .క్రూరమైన బ్రిటిష్ వలసవాదులు మరియు స్వదేశీ ప్రజల మధ్య పోరాటాన్ని పరిచయం చెయ్యడం జరుగుతుంది.
Inciting Incident
భీమ్, గిరిజన నాయకుడు, మల్లిని బ్రిటిష్ అధికారుల నుండి రక్షించేందుకు ఢిల్లీ కి వచ్చాడు అని నిజాం ఆస్థానం నుంచి వచ్చిన వ్యక్తి బ్రిటిష్ అధికారికి వివరిస్తాడు
Plot Point 1
రామ రాజు ఢిల్లీ లో ప్రవేశించిన వేటగాడిని పట్టుకునెందుకు ఒప్పుకుంటాడు అందుకు ప్రతిగా అతనికి స్పెషల్ ఆఫీసర్ పోస్ట్ ఇస్తా అంటారు .రామ రాజు కి భీమ్ కి కాన్ఫ్లిక్ట్ అంతర్లినం గా మొదలవుతుంది
Pinch 1
భీమ్ మరియు రాము కలిసి రైలు ప్రమాద సమయంలో ఒక చిన్నారిని రక్షిస్తారు, వారికి పరిచయం ఏర్పడుతుంది .ఇద్దరినీ ఒక రూఫ్ కిందకి తేవడం వల్ల టెన్షన్ మొదలవుతుంది
Midpoint/Point of No Return
భీమ్ మిన్నాగు కుట్టిన రామరాజు ని రక్షించే సమయం లో అక్తరే భీమ్ గా అతను వెతుకుతున్న వేటగాడిగా రామరాజు అర్థం చేసుకుంటాడు . ఈ నిజం రామరాజు మరియు భీమ్ ల లక్ష్యాల ను మరింత కష్టతరం చేస్తుంది
Pinch 2
రామరాజు తన బాబాయ్ తో మొదటి సారిగా తనకు స్పష్టత వచ్చింది అని భీమ్ ఒక నిజమైన విప్లవకారుడు అని అతన్ని కాపాడాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్తాడు
Plot Point 2
రామరాజు , భీమ్ మరియు మల్లి పారిపోవడానికి సహాయం చెయ్యడం కాని ఈ విషయాన్ని భీమ్ గుర్తించడు రామ రాజు ని గాయపరుస్తాడు సహాయం చేసే టైం లో చేసే క్రమం లో దొరికిపోతాడు .
Twist
సీత ద్వారా భీమ్ రాము తన శత్రువు కాదని తన తండ్రి కి ఇచ్చిన మాట కోసం బ్రిటిష్ అధికారుల పై తిరుగుబాటు కోసం ఆయుధాలను పొందేందుకు బ్రిటిష్ అధికారుల దగ్గర పనిచేస్తున్నాడు అని తెలుసుకుంటాడు
Climax
భీమ్ , రామ రాజు ని జైలు నుంచి రక్షిస్తాడు ఇద్దరు కలిసి బ్రిటిష్ సైనికులతో పోరాడి స్కాట్ దొర ని చంపేస్తారు అతని భార్య ప్రమాదం లో మరణిస్తుంది .భీమ్ రామ రాజు కి కావాల్సిన ఆయుధాలని సాధిస్తాడు
Ending Image
సీత రామరాజు ఆయుధాలతో తన మన్యాన్ని చేరుకొని తన ప్రజలకి అందిస్తాడు .
భీమ్ తన గూడెం చేరుకొని మల్లిని తన తల్లికి అప్పగిస్తాడు జల్ జంగ్ జమీన్ నినాదాన్ని తన వెంట తీసుకేల్తాడు
Other Articles –
1 thought on “RRR Movie Three Act Structure”